Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ పైప్ లైన్ రోడ్ కోణార్క్ హాస్పిటల్ సమీపంలో డాక్టర్ జే.వికాస్ రెడ్డి, డాక్టర్ శివానిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన లిటిల్ స్టార్ చిల్డ్రన్ క్లినిక్ ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన హాస్పిటల్ ఏర్పాటు ఎంతో అవసరమని, ఈ ప్రాంతంలో పిల్లలకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాలే నాగేష్, ఎల్లా గౌడ్, పులి మహేష్, బాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


