MLA Vegulla Jogeswara : ప్రజల చెంతలోనే ప్రభుత్వ పాలన

TRINETHRAM NEWS

గత వైసీపీ ప్రభుత్వం లాగా కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల చెంతలోనే కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం మండపేట మండలం, పేకేటిపాకలు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వ హయంలో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తామని వారికి ఆయన బరోసా కల్పించారు.

మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, భవిష్యత్తులో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు కేంద్ర బిందువుగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The government will rule

You cannot copy content of this page

Scroll to Top