తేదీ : 28/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం లో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ , ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూలో భాగంగా విద్యార్థులకు సంబంధించి సంబంధిత వివరణ తెలిపారు గ్రామాలు మరియు ప్రధానోపాధ్యాయులు రేణిగుంట సోడెం. సత్తిపండు, చెంచుగూడెం వంకా . శ్రావణి సు దా, నాగుల గూడెం సోడెం కృష్ణమ్మ, గుర్రప్పగూడెం మడివి. రామారావు, జోడే బోడేగూడెం కె. మధు కోయ అంకంపాలెం కుంజా. వెంకటలక్ష్మి, మెట్టగూడెం నె లబోయిన. సంగీత, కోట నాగవరం ఉడుత. విజయలక్ష్మి , కొవ్వాసు. నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క సమయం ప్రకారం పాఠశాలలు తెలుస్తున్నామని అన్నారు.
సంబంధిత పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో , కొత్తగా ఎంతమంది అడ్మిషన్లు పొందారో తెలిపారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద ప్రభుత్వ పట్టిక ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన అన్నము, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు రోజు విడిచి రోజు రాగిజావ మరియు, బెల్లం వేరుశనగ గింజలతో తయారుచేసినటువంటి చిక్కీలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పౌష్టిక ఆహారం విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. సమయపాలన ప్రకారం విద్యార్థులకు ఆటలు ఆడిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులకు సంబంధించి సామాగ్రి అనగా పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు యూనిఫామ్, బూట్లు సంబంధిత వాటన్నింటినీ అందించడం జరిగింది. విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హాజరు శాతం ప్రకారం విద్యార్థులకు తల్లికి వందనం రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమైనట్లు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


