వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఆదివారం గ్రామ పాలన అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న పరీక్షా సెంటర్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 83 మంది అభ్యర్థులకు గాను, 66 మంది హాజరయ్యారని, 17మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు.
లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన పరీక్షకు 139 మంది అభ్యర్థులకు గాను 121 మంది హాజరయ్యారని, 18 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు . లైసెన్సెడ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే పరీక్షను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలీసు బందోబస్తు తో పాటు ఎలాంటి కాపీ జరుగకుండా పరీక్ష ను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు..
కలెక్టర్ గారితో పాటు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్ డి ఓ వాసు చంద్ర, డి టి డి ఓ కమలాకర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ రాజేశ్వరి, తహసీల్దార్ లక్ష్మి నారాయణ,పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నెమత్ హాలీ, తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


