Prema Kumar : హౌసింగ్ బోర్డ్ స్థలాలను ఇష్టారాజ్యంగా వేలం వేస్తామంటే ఊరుకోం జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 25 : ఈరోజు కెపిహెచ్బి కాలనీ ఐదవ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ నందు కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతు పేద ప్రజల సౌలభ్యం తో దేవాలయాలకు, పాఠశాల కొరకు ,ఆట స్థలాల కొరకు , 10% స్థలాన్ని కేటాయిస్తూ ఆనాడు ప్రభుత్వం హౌసింగ్ బోర్డ్ ద్వారా ఎకరాలలొ ల్యాండ్ పులింగ్ చేసి ఈ డబ్ల్యూ ఎస్ , ఎల్ ఐ జి, ఎంఐజి, హెచ్ ఐ జి రూపేనా వివిధ కేటగిరీల ఇల్లు కట్టించి ప్రజలకు అనుకూలమైన ధరలకు ఇన్స్టాల్మెంట్ లొ అలాట్మెంట్ చేశారు , ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ అధికారులు స్థలాలను ప్రవేట్ వ్యక్తులకు వేలం ద్వారా కమర్షియల్ చేసి అమ్ముకొని డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. ఇది దారుణం హౌసింగ్ బోర్డ్ లో మిగిలిన ఎకరాల స్థలాలను పాత పద్ధతిలో వివిధ కేటగిరీలలొ అన్ని సౌకర్యములతో ఇల్లు కట్టించి అనుకూలమైన ధరలతొ ప్రజలకు అలాట్మెంట్ చేయవలసిందిగా జనసేన తరపున హౌసింగ్ బోర్డ్ అధికారులను కోరుతున్నాం అన్నారు.

ఇప్పటివరకు వేలం ద్వారా వచ్చిన ధనమును కొంత శాతం హౌసింగ్ బోర్డ్ కాలనీ డెవలప్మెంట్ కొరకు వాడాలని , ఏసియాలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి ఆటస్థలం లేదని , కైతలాపూర్ గ్రౌండ్ ని పిల్లల ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలతో కేటాయించాలని కోరుతూ , పేద ప్రజల శుభకార్యాలకై కేటాయించిన ఫంక్షన్ హాల్ ని కూడా వేలం వేయడానికి హౌసింగ్ బోర్డ్ అధికారుల ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అట్టి దారుణం జరిగినచో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్ ,వేముల మహేష్, కలిగినీడి ప్రసాద్ ,అంజి , సుంకర సాయి, బండిరెడ్డి క్రాంతి , పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders are not

You cannot copy content of this page

Scroll to Top