త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, తమకు కేటాయించిన భూములను, అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న, మాధవ రాయుడుపాలెం సర్పంచ్, అన్నం దేవుల చంటి పై అట్టర్ సిటీ కేసు నమోదు చేయాలని, జేగురుపాడు, ఎస్సీ ఫిషర్ మాన్ సొసైటీ అధ్యక్షుడు, సాక కిరణ్ కుమార్, మాజీ అధ్యక్షుడు, భాళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబాబు, మేకాటి మునియ్య, మంగళవారం, కడియం పోలీసులకు, ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ విలేకరులకు, తెలియజేసిన వివరాలు, 1977లో జేగురుపాడు గ్రామానికి చెందిన, దళితులకు సర్వేనెంబర్ 10లో 5.58, ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. సర్వే నెంబర్ 84,86లో సుమారు పది ఎకరాల భూమిని, మాధవ రాయుడుపాలెం దళితులకు, కూడా ఇచ్చారు అన్నారు. ఆ భూములో, దళితులు, వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఇటీవల పాలెం సర్పంచ్, అన్నం దేవుల, చంటి దళితుల భూములు కబ్జా చేయాలన్న ఆలోచనతో, చంటి వారిని రెచ్చగొట్టి, మాభూమిలోకి పంపించి గొడవలు సృష్టిస్తున్నారని దళితులు ఆరోపించారు. మా స్వాధీనంలో, ఉన్న భూమిని, చంటి కబ్జా చేస్తాడేమో అనే భయంతో, ఆ భూమిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కౌశ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చేపల చెరువు, ఏర్పరచుకున్నామని, తన రాజకీయ పలుకుబడితో, రెవెన్యూ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని, తాము ఏర్పాటు చేసుకున్న, విగ్రహాన్ని దిమ్మను, ధ్వంసం, చేశారన్నారు. అందువల్లనే చంటి పై, అతనికి సహకరించిన వారి పైన, ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ , నిరోధక చట్టం ప్రకారం, అరెస్టు చేయాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


