MLA Satyananda Rao : కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమ ప్రాధాన్యం

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే సత్యానందరావు….

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట : కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యం లభిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. దేవరపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి ఏడాది పాలన గురించి వివరించారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయన్నారు. సమస్యలు ఏమన్నా ఉంటే తెలియజేయాలని కోరారు. తల్లికి వందనం, మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలు పట్ల మహిళలు ఎమ్మెల్యే బండారు వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు.

త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు వారితో అన్నారు. సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సైతం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దివ్యాంగులతో మాట్లాడి పెరిగిన పింఛను పై అభిప్రాయం అడిగారు.గ్రామంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వారు ఎమ్మెల్యే వద్ద తమ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని యు పి స్కూల్ విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. కొత్తగా ఇచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు,యూనిఫామ్ ఎలా ఉన్నాయని వారిని అడిగారు. వారు చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సీఎం చంద్రబాబు, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Equal priority given to

You cannot copy content of this page

Scroll to Top