తేదీ : 20/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ లో పలుచోట్ల అమ్మవారికి ఆషాడ మాససారే సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మాజీమంత్రి విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వె ల్లంపల్లి. శ్రీనివాసరావు అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు సారె పేరుతో రకరకాల కానుకలు, సమర్పిస్తారని, తమ మొ క్కులను చెల్లించుకుంటారన్నారు.
ఇలా అమ్మవారికి సారె ఇవ్వడం వల్ల పంటల బాగా పండుతాయి అని, ఆరోగ్యంగా , సుఖ సంతోషాలతో ఉంటారని భక్తులు నమ్మకమన్నారు. తమ ఇంటి ఆడపడుచు గా అమ్మవారిని భావించి పిల్లాపాపలతో పాపలతో సహా భక్తులు తరలి వస్తారని అన్నారు. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకోవడం జరిగింది. స్థానిక నలభై ఎనిమిది వ డివిజన్ వాగు సెంటర్ దుక్క ఎల్లయ్య వీధిలోని వైసిపి నాయకుడు హరి భాస్కర్ నివాసం నందు అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
అదేవిధంగా ముప్పై ఎనిమిది వ డివిజన్ రావి చెట్టు దగ్గర భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పర మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. వైసిపి ఇంచార్జ్ శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ బొమ్మ. మధు, సభ్యులు నాగోతి. విజయనిర్మల, రామ్ పిల్ల వాసు .తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


