రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలి.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ.
దేవరకొండ జులై 19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ పట్టణం కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం హల్ లో MRPS మరియు అనుబంధ సంఘాల నియోజక వర్గ సమీక్ష సమావేశం మారుపాక గోపాల్ మాదిగ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ఏర్పడిన అనేక సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు.అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం,వికలాంగులు, వృద్దులు, వితంతువులు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని పోరాడి విజయం సాధించిందని అన్నారు.ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు,తెల్లరేషన్ కార్డులకు రూ 6 కిలోల బియ్యం పెంపు, మహిళ అత్యాచారాల నిరోధానికి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్ట్ పునరుద్ధరణ మొదలగు వాటి మీద పోరాడి పాలకుల మెడలు వంచి సాధించడం జరిగిందని అన్నారు.
అదే విధంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.4000 నుండి రూ 6000 వరకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లు రూ 2000 నుండి 4000 పెంచాలని కండరాల క్షీణత కలిగిన వారికి రూ 15000 పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.పెన్షన్ దారులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 19 నెలల గడిచినా నెరవేర్చకుండా ఘోరంగా మోసం చేయడం జరిగిందని అన్నారు.ఆగస్టు 13 న లక్షలాది మంది పెన్షన్ దారులతో మహా గర్జనను నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.
ప్రతి గ్రామం నుండి చేయూత పెన్షన్ దారులు స్వచ్ఛందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు.రేపటి నుండి ప్రతి గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని ఉద్యమ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైల మాదిగ, ఎంఎస్ఎఫ్ దేవరకొండ నియోజకవర్గం నల్ల శ్రీకాంత్ జాంభవ్, శ్రీరామదాసు వెంకట చారి, రామేశ్వరి నల్ల చెన్నయ్య, బుజ్జ చిన్న, ఈదుల ఎల్లయ్య, వింజమూర్ కృష్ణ, కాశయ్య, పోలే మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


