WhatsApp Image 2024 01 19 at 2.22.17 PM
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమ కుమార్ ఈ నెల 11వ తేదిన రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరిలించిగా…అతనికి 16వ తేదీన బ్రెయిన్ డెడ్ అయింది
దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన హేమ కుమార్ తల్లిదండ్రులు మానవత్వంతో ఆలోచించి హేమ కుమార్ అవయవాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు. అతడి గుండె,కాలేయం,రెండు ఊపిరితిత్తులను శస్త్ర చికిత్స చేసి వైద్యులు జాగ్రత్త చేసి తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న 29 ఏళ్ల యువకుడుకి గుండె ను అమర్చారు. అలాగే 53 ఏళ్ళ మహిళలకు కాలేయాన్ని అమర్చారు. స్విమ్స్ ఆసుపత్రిలో తొలిసారి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఇదే కావడం విశేషం.బ్రెయిన్ డెడ్ అయిన హేమ కుమార్ అవయవాలు దానం చేసి నలుగురికి పునర్జన్మను ఇవ్వడం విశేషం.
