కొత్తపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం రావులపాలెం మండలం కేతరాజుపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని స్కూలు పిల్లలతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ విధ్వంసం, అరాచక పాలన వల్ల అధోగతి పాలైన రాష్ట్రాన్ని కూటమి పాలన చక్కదిద్ది, ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. తల్లికి వందనం, దీపం, మెగా డీఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశామన్నారు.
‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు కసరత్తు పూర్తయిందని, పీఎం కిసాన్ పథకం తో పాటు నగదు జమవుతుందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం శతధా కృషి చేస్తుందన్నారు. పల్లెల్లో ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలతో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతున్న సందర్భంలో నంబుల సత్యదుర్గాలక్ష్మి అనే గృహిణిఉ తనకు నలుగురు పిల్లలు ఉన్నారని వారందరికీ తల్లికి వందనం నగదు జమైందని తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు వ్యాఖ్యానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


