School Holidays : తెలంగాణలో స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలోని విద్యార్థులకు, తల్లిదండ్రులు కీలక అలర్ట్.. రాష్ట్రంలో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అది కూడా రేపటి నుంచి అనగా జులై 19 శనివారం నుంచే ఈ సెలవులు అమల్లోక రానున్నాయి. జులై 19 నుంచి జులై 21 వరకు 3 రోజులు సెలవులు రాబోతున్నాయి. మరి వరుసగ సెలవులు ఎందుకు రానున్నాయి అంటే..

జులై 19 శనివారం సాధారణంగా చాలా స్కూళ్లకు హాఫ్ డే వర్కింగ్.. అలానే ఫస్ట్ క్లాస్ లోపు పిల్లలకు శనివారం నాడు సెలవు. ఆతర్వాత జులై 20 ఆదివారం అన్ని స్కూళ్లకు సెలవు. ఇక జులై 21 సోమవారం కూడా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు. ఎందుకంటే బోనాల పండుగ నేపథ్యంలో.. సర్కార్ జులై 21న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

ప్రస్తుతం తెలంగాణలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా గుర్తించింది. దీంతో ప్రతి ఏటా బోనాల సందర్భంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు. అలానే ఈ ఏడాది జులై 21 సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాను సెలవుగా ప్రకటించారు. ఈ లిస్ట్‌లో బోనాలు ఓ ఆప్షనల్‌ హాలీడే కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించారు. అంటే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు (గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలు) తప్పనిసరిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలోని విద్యాసంస్థలన్నింటికి జులై 21 సోమవారం సెలవు. రేపటి నుంచి అనగా శనివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడం విద్యార్థులకు శుభవార్తే కానీ.. వారిని పట్టుకోవడం తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే జులై 23న కూడా తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవు అని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం.. జులై 23 బుధవారం నాడు వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కారణం.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ప్రభుత్వ బడుల్లో, జూనియర్ కాలేజీల్లో శిక్షణా లోపాలు, టీచర్ల కొరత, మౌలిక సదుపాయాల కల్పన వంటి సమస్యల పరిష్కారం కోసం బంద్‌కు పిలుపునిచ్చారు. అలానే ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో జులై 23న కూడా విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశం ఉందంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three consecutive days of

You cannot copy content of this page

Scroll to Top