వాడపల్లిలో యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాల మెరుగుదల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యాల మెరుగుదలకై యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆలయంలో నూతన క్యూ లైన్ల ఏర్పాటు, మెడికల్ క్యాంపులు పెంపు, లడ్డు కౌంటర్లు తదితర ఏర్పాట్లను దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, అడిషనల్ డీ ఎం హెచ్ ఓ సుమలత, ఎమ్మార్వో రాజేశ్వరరావు, ఎంపీడీవో కె ఎస్ ఎస్ వెంకటరామన్ తదితరులు పరిశీలించారు.

మెడికల్ క్యాంప్ల అంశంలో అడిషనల్ డి ఎం హెచ్ ఓ సుమలతకు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పలు సూచనలు చేశారు. శనివారం వాడపల్లి తరలివచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఈ సందర్భంగా తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Improvement of facilities in

You cannot copy content of this page

Scroll to Top