తేదీ : 17/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇరగవరం మండలం లో పాఠశాల బస్సు పంట చేలోకి దూసుకెళ్లినటువంటి ఘటనలో గాయపడ్డ విద్యార్థులను తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. ఆ బస్సులో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేసిన తర్వాత ఇంటికి పంపించారు. పాఠశాల బస్సులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ అవసరం అని ఎమ్మెల్యే అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


