తేదీ : 17/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌరసరపరాల శాఖ మంత్రి మనోహర్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానూరు సివిల్ సప్లై భవన్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అవగాహన బాధ్యత లేకుండా అబద్ధాలు మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. రైతుల కోసం మీరు ఏం చేశారో చర్చకు సిద్ధమా ?
అని జగన్ కు సవాల్ విసిరారు. ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలి అని , ఐదేళ్లకు ఒకసారి అధికారం ఇస్తారని జగన్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రహదారులు గుంతలను కూడా పూడ్చలేకపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యపాన నిషేధం, అమ్మఒడి వంటి హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


