త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. వడ్డీలేని రుణాలు 21 కోట్ల 58 లక్షల విలువైన చెక్కుల పంపిణీతో పాటు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేత
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఓ అద్భుతమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి వచ్చిన డ్వాక్రా మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. డ్వాక్రా మహిళల సాంస్కృతిక ప్రతిభకు ప్రాధాన్యతను ఇస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు తదితర చక్కని కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన డ్వాక్రా మహిళలకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా రెవిన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు, స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ, ఐటిడిఏ పిఓ బీ రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్గొని డ్వాక్రా మహిళలకు సుమారు రూ 21 కోట్లు 58 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
అనంతరం నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను పలువురు లబ్ధిదారులకు అందించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల బలోపేతానికి దోహదపడనుంది… ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


