జూన్ 27, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 16 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద సమస్య ఎక్కువగా ఉందని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కొరకు ఎం.ఎల్.ఓ ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌ ను చెరువులో వేయడం వల్ల లార్వ దశలోనే దోమలు మృతి చెందుతుంది కాబట్టి వ్యాప్తి జరగకుండా నియంత్రించవచ్చని అన్నారు. ప్రజలు కూడా తమవంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వారానికి ఒకసారైనా తనిఖీచేసుకుని మీ ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలను తొలగించాలని అన్నారు.

ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరికి వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. చెత్తను కూడా వీధుల్లోనూ కాలువలోను వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. ప్రగతి నగర్ నుండి వస్తున్న డ్రైనేజీ నీరును ఎల్లమ్మచెరువులో కలవకుండా దారి మళ్లించే విధంగా పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. పైప్ లైన్ నిర్మాణం పూర్తయిందంటే ఎల్లమ్మచెరువులో డ్రైనేజీ నీరు కూడా కలవదు కాబట్టి చెరువు నీరు శుభ్రంగా ఉండి గుఱ్ఱపుడెక్క పెరగడం, దుర్వాసన రావడం, దోమల బెడద వంటి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్ ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Danger of mosquito bites

You cannot copy content of this page