గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని రజక కులస్తులు, కార్పోరేషన్ రజక సంఘం ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్, నడిగట్టు పోషం ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ రహదారిని అనుకోని ఉన్న ఐబీ కాలనీ సమీపంలోని శ్రీ మడలేశ్వర స్వామికి ఘనంగా బోనాలు సమర్పించారు. నగరంలోని గాంధీనగర్, బాబుజి నగర్, సీఎస్పీ కాలనీ, ఐబి కాలనీ నుండి రజక కులస్తులు పెద్ద ఎత్తున బోనాలు నెత్తిన ఎత్తుకొని మడలేశ్వర స్వామికి మొక్కులు చెల్లించారు. ఈ బోనాల పండుగకు ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, గోదావరిఖని రజక సంఘం అధ్యక్షుడు పైడిపల్లి తిరుపతి, 6వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్గంపల్లి శ్రీనివాస్, బేబీ శ్రీనివాస్ బోనాలు సమర్పించి పూజలు చేశారు.
ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మహిళ నాయకురాలు ఇజ్జగిరి కొమరవ్వ, బస్తి పెద్ద మనుషులు వెదరే కొండయ్య, జనగామ సాయిలు, జాలిగా ఐలయ్య, గూడెం రామచందర్, కాసర్ల రాజేశం, కాసర్ల సంపత్, శంకర్, రామడుగు రాములు, చెలికాని రవి, యూత్ నాయకులు జంగంపల్లి అశోక్ కుమార్, మాచర్ల శ్రీకాంత్ మరియు అధిక సంఖ్యలో రజకులు పాల్గొని విజయవంతం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


