Marijuana : అరకు రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణా తనిఖీలు ముమ్మరం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్, జూలై 12: అరకు రైల్వే స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. హిమగిరి, అరకు వేలి ఎస్సై జి. గోపాల్ రావు నేతృత్వంలో ఆర్‌పీఎఫ్ పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు.
విశాఖపట్నం కిరండాల్‌కు వెళ్లే మరియు అదే మార్గంలో వచ్చే పాసింజర్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని నిత్యం తనిఖీలు కొనసాగుతున్నాయి. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేకించి అనుమానాస్పద ప్రయాణికుల లగేజీపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ప్రతి రోజు వచ్చే పోయే రైళ్లపై నిఘా కొనసాగిస్తూ, అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి మార్గాలను గుర్తించి, వాటిని అడ్డుకునే దిశగా చర్యలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Araku Railway Station: Checks

You cannot copy content of this page

Scroll to Top