Trinethram News : గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి. రామగుండం పోలీస్ కమీషనర్ దేశాలతో డీసీపీ, ఏసీపీ ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో 5 గంటల నుంచి గోదావరిఖని పట్టణంలోని రమేష్ నగర్, తిలక్ నగర్, 5 ఇంక్లైన్, గాంధీ చౌక్, మార్కండేయ కాలనీ, బస్ స్టాండ్ ప్రాంతం, ప్రధాన కూడల్లా వద్ద ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు నేరా నియంత్రణ ముందస్తు చర్యలలో భాగంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణాను నిరోధించడానికి, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారి గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయడం ద్వారా నేరాల నియంత్రణ కోసం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ తనిఖీ లలో స్వయంగా సీఐ తనిఖీ లలో పాల్గొని సిబ్బంది తో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అతి వేగంగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకోని జరిమానాలు విధించడం జరిగింది శబ్ద కాలుష్యాన్ని సృష్టించే, ప్రజలకు ఇబ్బంది కలిగించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కలిగి ఉన్న వాహనాలను వెంటనే గుర్తించి ఆ సైలెన్సర్లను తొలగించడం జరిగింది హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు.
డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, వాహనాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రికార్డులలు సక్రమంగా లేని వాహనాలకు జరిమానా విధించడం జరిగింది వాహనదారులు నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్లు, సీట్ బెల్టులు మరియు ఇతర భద్రతా నిబంధనలను పాటించేలా చూడడానికి, ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై వాహనదారులకు సీఐ గారు అవగాహనా కల్పించారు ఈ తనిఖీ లలో ఎస్ఐ భూమేష్, రమేష్, అనూష, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


