జూలై 5, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్. హరిహర వీరమల్లు సినిమాకు వ్యతిరేకంగా పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట బహుజన విద్యార్థుల నిరసనప్రజా వీరుడు, బండూక్ వీరుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించేలా రూపొందుతున్న “హరిహర వీరమల్లు” సినిమా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట తీవ్ర నిరసన నిర్వహించారు. చరిత్రను తారుమారు చేస్తూ, కల్పిత పాత్రల ద్వారా బహుజన ఉద్యమ యోధులను అవమానించాలనే కుట్రలో భాగంగా ఈ సినిమా తీస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐఓబీసీసా నాయకులు డా. వై. శివ ముదిరాజ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర రచయిత బెక్కం జనార్దన్, పాలమూరు యూనివర్సిటీ బీసీ సంఘం అధ్యక్షులు తాయప్ప, పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు వెంకటేష్, ప్రొఫెసర్ గాలన్న, రామ్మోహన్ జి, రవీందర్, ఇంచార్జ్ మచ్చేందర్, విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు మరియు వివిధ బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సెన్సార్ బోర్డు తక్షణమే ఈ సినిమాకు అనుమతులు నిలిపివేయాలి. చరిత్రను వక్రీకరించడాన్ని బహుజన సమాజం సహించదు. న్యాయపరమైన, ప్రజా పోరాట పంథాలో ఈ సినిమాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు నాయకులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Harihara Veeramallu movie should

You cannot copy content of this page