అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రంన్యూస్ జూలై 11 : ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. బుధవారం అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రుల పేరుతో నిర్వహించిన మెగా మీటింగ్ ప్రజాధనాన్ని వృథా చేసిన కార్యక్రమమని మండిపడ్డారు.చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి కూడా తల్లుల ఖాతాల్లో జమ కాకుండా “ తల్లికి వందనం” మాయాజాలంగా మారిందన్నారు. నిరుద్యోగ భృతిపై పక్కా హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని, రైతు భరోసా పేరుతో కూడా సమయానికి నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, డోలి మోతల గ్రామాలకు రహదారులు నిర్మించాలన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. హామీలు అమలు చేయకపోతే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాంగి చిన్నారావు, కమ్మిడి అశోక్, పెట్టెలి శుక్ర, స్వాబి రామ్మూర్తి, పరశురాం, విజయ్, ప్రకాష్, జన్నీ నరసింహమూర్తి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


