అనంతగిరిలో ఉత్సాహపూరిత కార్యక్రమం
అల్లూరిజిల్లా అనంతగిరి త్రినేత్రం న్యూస్ జూలై 11: అనంతగిరి మండలం ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు కొర్ర అప్పలస్వామి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని PS ఉపాధ్యాయుడు భాస్కరరావు వాక్యతగా నడిపించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా తహసీల్దార్ మాణిక్యం, ఎగువ శోభ సర్పంచ్ కొర్ర సింహాద్రి, జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి హాజరయ్యారు. విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరాలు అందజేశారు. పెద్దలు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ విలువైన సూచనలు చేశారు.
అలాగే పేరెంట్స్ కోసం ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మత్యలింగం, సొమర, సుబ్బారావు, వాసుదేవ్, సింహచలం, ప్రశాంత్, ధర్మ, జయరం, రమేష్ నాయుడు, జానకిరావు, డిప్యూటీ వార్డెన్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎస్ఎంసి చైర్మన్ జి. రామూర్తి, మహిళా పోలీస్ మంజు, జీవన జ్యోతి తదితరులు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


