Corporator : కల్తీ కళ్ళు తాగడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారని శంషిగుడా, హైదర్ నగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించిన కార్పొరేటర్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూలై 9 : శంషిగుడా, హైదర్ నగర్ పరిసర ప్రాంతాలలో గత ఆదివారం నుండి స్థానికంగా ఉన్న కల్లు దుకాణాలలో కల్లు తాగిన కొంత మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, బాధితులు ఇంకా ఎక్కువ ఉండవచ్చు అనే అనుమానంతో ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మరియు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి సాయి చరణ్ కాలనీ పరిసర ప్రాంతాలలో పర్యటించి, స్థానికులతో మాట్లాడి గత రెండు మూడు రోజులనుండి కల్లు తాగి వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించి వారి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి, వారిని వెంటనే నిమ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కల్లు దుకాణాలలో కల్లు తాగిన కొంతమందికి అదే రోజు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా, మరుసటి రోజు ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి అని అన్నారు. వారికి బీపీ పడిపోవడం, వాంతులు, విరేచనాలు, వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవ్వడంతో హాస్పిటల్ కు తరలించడం జరిగిందని అన్నారు. అస్వస్థతకు గురైన రోగులకు తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ లో ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పించింది కాబట్టి కొంతమంది అవగాహన లేక సమస్య గురించి సమాచారం తెలియని రోగులను గుర్తించి వారిని నిమ్స్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు.

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని, నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చాలామంది నిజాయితీగా వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారని, ఒక్కరూ చేసిన తప్పుకు అందరిని నించించడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, వెంకట్ నాయక్, శివరాజ్ గౌడ్, లక్ష్మమ్మ, శివ, బాబు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.మీరు గాని మీకు తెలిసివారు గాని బీపీ పడిపోవడం, వాంతులు, విరేచనాలు, వంటి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే నిమ్స్ కు వెళ్లి వైద్యం చేయిచుకోవాలని కార్పొరేటర్ గారు తెలియచేసారు. ఏదైనా అవసరం ఉంటే మా కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Corporator, who visited

You cannot copy content of this page

Scroll to Top