కొనసాగిన ఎమ్మెల్యే వేగుళ్ళ తొలి అడుగు పర్యటన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సుపరిపాలన లో భాగంగా సోమవారం రాయవరం మండలం, పసలపూడి, మండపేట మండలం, తాపేశ్వరం, మండపేట పట్టణంలో 16వ వార్డు, గొల్లపుంత కాలనీలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కూటమి నాయకులతో కలసి ఇంటింటికి పర్యటించారు. ఈ సంధర్బంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. కూటమి పాలనలో ప్రతీ ఇంట సంక్షేమం అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రతీ ఇంట సంతోషంతో ప్రజలు ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు.
అందరూ ఆప్యాయతతో కూడిన చిరునవ్వులతో, పలకరింపులతో 6వ రోజు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ప్రభుత్వ పధకాలను వివరిస్తూ అందరినీ పలకరిస్తూ ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు కోరిన పలు సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే కొన్నింటికి పరిష్కారం చూపుతూ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేలా అధికారులకు సూచిస్తూ 6వ రోజు పర్యటన ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


