తేదీ : 05/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలంలో ఉన్నటువంటి మండల పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు దాసయ్య పాలెం కె. పి. సుధాకర్, నిమ్మలగూడెం ఆర్. చంద్రకళ, వేదాంతపురం కె. రాజారత్నం, కొత్తపేట టి. వెంకటలక్ష్మి, పాలకుంట కె. గంగాభవాని చింతలగూడెం తెల్లం .గంగరాజు , కన్నాపురం కుంజా. వెంకాయమ్మ, బిల్లిమిల్లి జి. రాజేష్, తదితర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ సమయం ప్రకారం ప్రతిరోజు పాఠశాలలు తెరు స్తున్నామని, విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన అన్నము మరియు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం మరియు వేరుశనగ గింజలతో తయారుచేసినటువంటి చిక్కీలు ను అందిస్తున్నామని.
క్రమశిక్షణతో కూడిన మంచి విద్యాబోధన, ఆటలు, అదేవిధంగా ఆయా పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో , కొత్తగా విద్యార్థులు ఎంతమంది జాయినింగ్ అయ్యారో తెలపడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి మెటీరియల్స్ అన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు , వాళ్లతల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. తల్లికి వందనం సంబంధించి పాఠశాలలో డెబ్బై శాతం హాజరు ఉన్నటువంటి విద్యార్థులందరికీ డబ్బులు పడ్డాయని అభినందనలు తెలిపారు. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగిన కూటమి ప్రభుత్వం రావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


