హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు చేపట్టాలి.
త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) నియోజకవర్గఇంచార్జ్ : ప్రజలు అభిప్రాయం ప్రకారం రోడ్డు విస్తీరణ పనులు చేపట్టాల్సిందే అంటూ •రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రంల్లో అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగించాలని, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తూచ తప్పకుండా పాటించి పాడేరు ప్రధాన కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొదటి శనివారం ఆక్రమణల తొలగింపు పనులు మొదలు పెట్టీ తరువాత రోడ్డు విస్తరణ పనులు ఆపేయడంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద స్థానికులతో కలిసి బైఠాయించారు.
నాలుగు గంటలపాటు జోరు వాన సైతం లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నా చేపట్టారు. వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే భోజనాలు చేశారు. . ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రతి శనివారం విడతలు వారిగా షాపులు తొలగిస్తామని చెప్పారన్నారు, ఒక్క వారం మాత్రమే తొలంగింపు ప్రక్రియ చేపట్టి తర్వాత ఆరు వారాలు గడిచిన ఎటువంటి పనులు జరగడం లేదని అన్నారు. పాడేరు జిల్లా ప్రధాన కేంద్రం కావడంతో రోజు, రోజుకు వాహనాల రద్దీ ఎక్కువై ట్రాపిక్ అంతరాయాలు కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అభివృధి కోరుకుంటున్నారన్నారు. ఆక్రమణల తొలగింపు నిలిచిపోవడంతో మెజార్టీ ప్రజాభిప్రాయాలు మేరకే తాను ఉద్యమం చేస్తున్ననన్నారు. నాలుగు గంటల పాటు ఆందోళన కారణంగా సుమారు నాలుగు గంటల మేర ట్రాపిక్ అటూ, ఇటూ ఆగిపోయింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చారు.
సోమవారం కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణల తొలగింపు పై చర్యలు తీసుకుంటామని ఆక్రమణల తొలగింపు కచ్చితంగా చేపడతామని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు సిదరి రాంబాబు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్న దొర, కించురు సర్పంచ్ వంతల రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్ కుమార్, పార్టీ సీనియర్ నేత కూడా సుబ్రహ్మణ్యం, రుడకోట పంచాయతీ సర్పంచ్, అధ్యక్షుడు కాతరి సురేష్ కుమార్, మాజీ సర్పంచ్ మినుములకన్నాపాత్రుడు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గంగరాజు,గుల్లేలి లింగమూర్తి, ఈశ్వరరావు, బాబి, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


