వరంగల్ జిల్లా 04 జులై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జూలై 09న నిర్వహించనున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల మహాధర్నాను జయప్రదం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూలై 09న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎన్ హెచ్ ఎం ఉద్యోగులంతా జులై 09 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో మహాధర్నా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ 78 క్యాడర్స్ ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని రామ రాజేష్ ఖన్నా ఉద్యోగులకు పిలుపునిచ్చారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


