Good Governance : సంతబయలులో సుపరిపాలనలో తొలి అడుగు

TRINETHRAM NEWS

జోరుగా మూడోవరోజు ప్రచారం

త్రినేత్రం న్యూస్,( పాడేరు ) నియోజకవర్గఇంచార్జ్ : ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం గుత్తులపుట్టు పంచాయతీ సంతబయలులో ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు అధ్యర్యంలో మూడవరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.

ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే తల్లికి వందనం,దీపం పథకం,అన్నక్యాoటీన్లు,మెగా డిఎస్సి,ఎస్సి వర్గీకరణ,బీసీ సంక్షేమo, గుంటలులేని రోడ్లు,సబ్సిడీ విద్యుత్, సురక్షిత ఆంధ్రప్రదేశ్, మహిళ సంక్షేమం, పోలవరం నిర్మాణం, రాజధాని ఏర్పాటు వంటి ఏన్నో విజయాలు సాదించమన్నారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి మత్యరాస మణికుమారి, మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, , తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ , సీనియర్ నాయకుడు శోభ శ్రీను, బళ్ళోజి గురువుల చిరంజీవి,కొంతేలి లక్ష్మణ్ ,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

First step in good

You cannot copy content of this page

Scroll to Top