Please Repair our School Building : మా పాఠశాల భవనం మరమ్మత్తులు చేయండయ్య

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గఇంచార్జ్: అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, మారుమూల బూదరాళ్ల పంచాయితీ పరిధిలో గల గొర్రెలమెట్ట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులు విద్యానభ్యశిస్తున్నారు. గత వేసవిలో కురిసిన భారీ, అకాల వర్షాలకు పాఠశాల రేకులు గాలి తాకిడికి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం 1కిలో మీటరు దూరంలో ఉన్న చర్చిలో పాఠాలు బోధిస్తున్నారని, SMC కమిటీ చైర్మన్ లు పాంగి అప్పారావు, వణిజలు తెలిపారు.

ఈ స్కూల్ మరమ్మత్తులు కొరకై నిధులు వెచ్చించడం కొరకు సంబంధత శాఖ అధికారులకు తెలియజేసి, గతంలో పాడేరులో జరిగిన “మీ కోసం” కార్యక్రమంలో స్థానిక సర్పంచి సాగిన ముత్యాలమ్మ, వార్డ్ సభ్యులు సంజీవ్ లు కలిసి ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా సమస్యని వివరించి, అర్జీ నమోదు చేయడం జరిగింది. కానీ నేటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమన్నారు. గతంలో స్పందన, మీ కోసం కార్యక్రమాల్లో పంచాయితీ పరిధిలో మరికొన్ని పాఠశాలల పరిస్థితి కూడా ఈ విధంగానే శిధిలస్థితిలో ఉంటే గోధుమలంక, పోకలపాలెం, చీడిపల్లి, బాలరేవుల, అన్నవరం తదితర గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికి శాఖ అధికారులు నుండి ఎటువంటి స్పందన లేదని, అటువంటప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్పందన, మీకోసం కార్యక్రమాల మీద ప్రజలకు నమ్మకం పోతుందని, వారు తెలిపారు.

ఇప్పటికైనా గొర్రెలు మెట్ట ఎంపీపీ పాఠశాలని మరమ్మత్తులు లేదా నూతనంగా అదనపు తరగతి గదిని మంజూరు చేయడం గానీ చేయాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ శాఖ అధికారులు పిల్లలు యొక్క తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాగి సత్తిబాబు, చిట్టిబాబు, గెమ్మెలి మనోజ్ కుమార్, సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డు నెంబర్ సంజీవ్, తదితరులు మీడియా ముందు తమ ఆవేదన తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Please repair our school

You cannot copy content of this page

Scroll to Top