జూలై 5, 2026

WhatsApp Image 2023 12 14 at 9.00.52 PM

TRINETHRAM NEWS

Indian Army: సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..

మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన 1,217 మంది పర్యాటకులను ఇండియన్‌ ఆర్మీ (Indian Army) రక్షించింది. భారత సైన్యంలోని త్రిశక్తి దళాలు బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈమేరకు ఆర్మీ ఉన్నతాధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. వాళ్ల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. చిక్కుకున్నవారిలో చాలా మంది మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక చాలా మంది స్పృహ కోల్పోయారని తెలుసుకున్న వెంటనే అప్రమత్తమై త్రిశక్తి దళాలు ఆపరేషన్‌ చేపట్టినట్లు ఆర్మీ వెల్లడించింది..

You cannot copy content of this page