బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 4 : కూకట్ పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ ఇండస్ట్రీ ఏరియాలో “స్నేనేత్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ” లో జితేంద్ర కుమార్ అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కంపెనీ లో పనిచేసేవారు, కొన్ని అనివార్య కారణాలవల్ల స్నేనేత్ ఎంటర్ ప్రైజెస్ లో పనిచేస్తున్న జితేంద్రకుమార్ మానేయడం జరిగింది.
జితేంద్ర కుమార్ అనే కార్మికుడికి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వేతనం, రావాల్సి ఉండగా అవి ఇవ్వకపోవడంతో పలుమార్లు కంపెనీ యజమాన్యాన్ని ఎన్నిసార్లు అడిగినా జితేంద్ర కుమార్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తనను ఏదో రకంగా కంపెనీ యజమాన్యం పట్టించుకోవడం లేదు అని తెలుసుకొని అడిగి అడిగి విసుగు చెందిన కార్మికుడు జితేంద్ర కుమార్ కు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.
వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన “స్నేనేత్ ఎంటర్ ప్రైజ్స్ కంపెనీ” వద్దకు బయలుదేరి యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి జితేంద్ర కుమార్ కి రావలసిన ఏప్రిల్ నెల వేత్తనం ఇప్పించడం జరిగింది. కార్మికుడు జితేంద్ర కుమార్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


