ఉద్యోగం తొలిగింపు రంగం సిద్ధం
Trinethram News : టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ స్థాయి లేఆఫ్‌లు ప్రకటించడం ఇది రెండోసారి.
టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ స్థాయి లేఆఫ్‌లు ప్రకటించడం ఇది రెండోసారి. అయితే, ఈసారి ఎంతమందిపై వేటు పడనుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ.. దాదాపు నాలుగు శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది.
కొన్ని మీడియా కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి లేఆఫ్‌లు ఇచ్చినట్లు సమాచారంజూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను మొదలుపెట్టిన టెక్ దిగ్గజం.. ఈ ఏడాది మే నెలలో 6 వేల మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. తాజాగా మరోసారి పెద్దఎత్తున తొలగింపునకు సిద్ధమైంది. తాజా నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో నాలుగు శాతం.. అంటే దాదాపు 9100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు అంచనా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


