Need a School : మాకు పాఠశాల కావాలి – కంజరితోట గ్రామస్తుల వినతి

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకువ్యాలీ మండలం, త్రినేత్రం న్యూస్: జులై 3 : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువ్యాలీ మండలంలోని బస్కి పంచాయతీ పరిధిలోని కంజరితోట గ్రామం వాసులు తాము ఎదుర్కొంటున్న విద్యా సమస్యలపై ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్ల పిల్లలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తుండగా, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 20 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా సుమారు 2 కిలోమీటర్లు నడిచి సమీప గ్రామమైన కొర్రగుడలోని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి పూర్తిగా చిత్తడిగా మారిపోవడం, చిన్నారుల ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడం వల్ల చదువులో అంతరాయం ఏర్పడుతోంది.
ఇంకా, గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు. అంగన్‌వాడీ నౌకాశ్రయంగా వెళ్లడం కూడా కష్టతరంగా మారిందని వారు తెలిపారు. దీతో పాటు, దోబురంగిని, కంజరితోట, కొర్రగుడ గ్రామాల విద్యార్థులందరికీ ఒక్కటే కొర్రగుడ స్కూల్ ఉండడంతో, కేవలం రెండు తరగతి గదులే ఉండటంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు.
కంజరి తోట గ్రామానికి ఒక ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం మంజూరు చేయాలని, గ్రామస్తులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులు, మండల విద్యాశాఖాధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున జి.రామన్న,కె.సుబ్బారావు,కె. దేవన్న (పీసా కార్యదర్శి) మాధ్యమాల ద్వారా తమ విన్నవిని తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We need a school

You cannot copy content of this page

Scroll to Top