తేదీ : 30/06/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెద్దాపురం మరిడమ్మ జాతరలో గంజాయి బ్యాచ్ హాల్ చల్ చేసింది. జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లు జరిగాయి. ఈ క్రమంలో వాళ్లు చేస్తున్నటువంటి నృత్యాలు చూసి గంజాయి, మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, రక్తం వచ్చేలా కొట్టుకోవడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వాళ్లని వైద్యశాలకు తరలించారు. సదరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


