త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన నాగమల్ల వీరభద్రరావు (రావు) వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) రాష్ట్ర రైతు విభాగం కమిటీ లో నూతనంగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా, అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మరియు అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వారికి శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు (రాష్ట్ర కమిటీ సెక్రటరీ ), గుత్తుల రమణ (పెదపూడి మండల కన్వీనర్), కేతా శ్రీనివాస్ ( పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షులు), సాంబత్తుల చంటి (అనపర్తి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు),ద్వారంపూడి వెంకటరెడ్డి (వైస్ ఎంపీపీ సభ్యులు), కరెడ్ల వెంకన్న బాబు (వైస్ ఎంపీపీ సభ్యులు), మండ రాజారెడ్డి (రాష్ట్ర ప్రచార విభాగం సెక్రెటరీ), విజయ్ రెడ్డి(రాష్ట్ర యువజన సెంట్రల్ యూత్ కన్వీనర్), కర్రి వెంకటరెడ్డి (జె సి ఎస్ కన్వీనర్),నియోజకవర్గ సర్పంచ్ ల సమాఖ్య అధ్యక్షుడు రామేశ్వరం సర్పంచ్ కొటికలపూడి చినబాబు, సర్పంచ్ ల మండల సమాఖ్య అధ్యక్షుడు కోసూరి వాసు,తాతారెడ్డి (ఉప సర్పంచ్), వీర్రెడ్డి (ఎంపీటీసీ సభ్యులు), రాయుడు రాఘవ (మామిడాడ వార్డు సభ్యులు) (గ్రామ సర్పంచులు కొనకర వాసు, సుందరంపల్లి వీరభద్రం, డోకు బుర్ర కృష్ణ, కొటికలపూడి చినబాబు), కోసూరి సూరిబాబు, అశోక్, ఇమ్మంది దుర్గాప్రసాద్, దేవా, సుధాకర్ రెడ్డి, కట్టా రమణ (ఉప సర్పంచ్), నల్లా సూరిబాబు (గ్రామ కన్వీనర్), గంగు మల్ల సుబ్రహ్మణ్యం, కొటికలపూడి శ్రీను, రాజుపాలెం గ్రామ వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


