Nationwide Strike : జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనీ విజయవంతం చేద్దాం!!

TRINETHRAM NEWS
  1. లేబర్ కోడ్స్ రద్దు. ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకై పోరాడుదాం!

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్జీ 1.డే జిమ్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సింగరేణి పాలరీస్ కాంట్రాక్టు వర్కర్ యూనియన్(ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాధనాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుందని విమర్శించారు.
సంపద పోగు పడటానికి కారణమైన కార్మిక వర్గ హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు పని గంటల పెంచడం, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం,పోరాడే సాధించుకున్న హక్కులను తొలగించడం తదితర వినాశకర విధానాలనాల పై కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు సింగరేణిలో బొగ్గు బావులను ప్రైవేటు పరం చేయవద్దని,సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు తగ్గకుండా చెల్లించాలని,సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యల పరిష్కారానికి దేశవ్యాపిత సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర నాయకులు ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం జిల్లా నాయకులు ఎం కొమరయ్య.తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's participate in the

You cannot copy content of this page

Scroll to Top