WhatsApp Image 2024 01 17 at 7.45.10 PM
Trinethram News : ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు.
ఈ నెల 22 తర్వాతే ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సమాధి సందర్శించి బాధ్యతలు తీసుకోనున్నారు .
కడప జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా జనసమీకరణ చేయటానికి, భారీ ప్రదర్శనగా వైఎస్ఆర్ సమాధి దగ్గరికి వెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ..
పార్టీల సీనియర్లను అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు..
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను తనదారిలోకి తీసుకొచ్చే దిశగా షర్మిల వ్యూహం రచిస్తున్నారు. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దు అని హర్షకుమార్ లాంటి కొంతమంది సీనియర్లు బహిరంగంగానే ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
అలాంటి అసంతృప్తవాదులను, సీనియర్లను తన దారిలోకి తెచ్చుకునేలా, తనపై ఉన్న వ్యతిరేకతను పూర్తిగా పొగొట్టుకునేలా షర్మిల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వారితో కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయటానికి సిద్దం అయ్యారు…
