బీసీలపై కొనసాగుతున్న విపక్షకు ముఖ్యమంత్రి సొంత జిల్లానే నిదర్శనం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గ్రామస్థాయిలో బీసీలు ఐక్యమైతే అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం నల్లేరుపై నడకే . విజయవంతంగా వికారాబాద్ జిల్లా బీసీ ముఖ్య నాయకుల సమావేశం.బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా, గ్రామమే రాజకీయ యూనిట్ గా కమిటీల నిర్మాణం షురూ .ప్రతీ గ్రామం ఒక యూనిట్ గా బీసీ ఐక్య వేదికల నిర్మాణం.గ్రామాల్లో బీసీలను గుడుంబా, చీప్ లిక్కర్ కు బానిస చేసిన అగ్రవర్ణ పాలకులు.42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు భాద్యత ఎవరిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రేజర్వేషన్ల పెంపుకు సమిష్టిగా కృషి చేయాలి..
ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ నందు నాలుగు నియోజకవర్గాలకు గాను కనీసం ఒక స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం బీసీలపై కొనసాగుతున్న వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యం అని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు.గ్రామ స్థాయిలో బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం నల్లేరుపై నడకే అని దాసు సురేష్ తెలిపారు.. వికారాబాద్ జిల్లా వ్యాప్త బిసి ముఖ్య నాయకుల సమావేశాన్ని వికారాబాద్ పట్టణం నందుగల అశ్విత్ విలా నందు ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల ముఖ్య నాయకులు కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన బీసీ జెండా ఎగరేస్తామని, గ్రామ స్వరాజ్యం సాధించాలంటే బీసీలకు రాజ్యాధికారం చేరువ కావాలని అందుకు తాము పూర్తిస్థాయిలో నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రతి గ్రామాన్ని ఒక రాజకీయ యూనిట్ గా ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయి కమిటీలను జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా మండల వారీగా, ఎన్నికలు ఎన్నికలు జరిగే ప్రతి చోట బీసీ ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గ్రామాలలో బీసీలను, అటుడుగు వర్గాలను చీప్ లిక్కర్లకు గుడుంబాకు పాలకవర్గాలు పరిమితం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ల పెంపుపై ప్రధాన పార్టీలు దోబూచులాడుతున్నాయని ఆరోపించారు .
కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అందించాల్సిన గురుతర బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నదన్నారు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని బీసీ రేజర్వేషన్ల పెంపుకు నిబద్దతతో కృషి చేయాలన్నారు ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా కాలయాపన చేస్తుందే తప్ప అందుకు అవసరమైన జీవోను విడుదల చేయడం గాని రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయడానికి పూనుకోకపోవడం విచారకరమని దాసు సురేష్ పేర్కొన్నారు..కేంద్ర ప్రభుత్వ నిధులు, తమ ప్రాధాన్యత కలిగిన అంశాల పట్ల పలుమార్లు ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ పెంపు కోసం కనీసం ఒక్కసారి కూడా కలవకపోవడం దారుణమన్నారు .త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి కార్యవర్గ కమిటీలను గడప గడపను చేరుకొని బీసీల సభ్యత్వ నమోదు నమోదును సంపూర్ణంగా పూర్తి చేసి రాబోయే ఎన్నికల్లో బీసీలను బలమైన రాజకీయ శక్తిగా మారుస్తామన్నారుఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా నాయకులు రవీందర్ యాదయ్య గౌడ్ గార్ల పెళ్లి రాములు, లాలయ్య ముదిరాజ్, జి శ్రీశైలం, జ్యోతి గౌడ్ నామ అనంతం, గాజుల ప్రభు, నామ ఆనందం, ఊట్ల నరేందర్, ఎర్ర లక్ష్మణ్ బాబు ,బాస నరసింహులు ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Chief Minister's own

You cannot copy content of this page

Scroll to Top