ప్రధాన రహదారి అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం
అల్లూరిజిల్లా(అరకులోయ టౌన్) త్రినేత్రం న్యూస్ జూన్ 28 : అరకు – చాపరాయి – పాడేరు ప్రధాన రహదారి మధ్యలో అరకు గ్రామానికి రైల్వే స్టేషన్ మార్గ మధ్యలో ఉన్న బురద గెడ్డ వంతెన ప్రమాదకరంగా మారినా సంబంధిత శాఖలు కనీస స్పందన చూపడం లేదు. ఈ రహదారి ద్వారా అరకు, చాపరాయి, పాడేరు, ప్రాంతాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంటుంది. నిత్యం పర్యాటకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ పిల్లలు, వాహనదారులు, వ్యాపారస్తులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఇప్పుడు బురద గెడ్డ వంతెన మానవ మృత్యు గొల్లపాలిగా మారింది భయం గుప్పెట్లో వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది.
ఈ వంతెన వద్ద ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ, బాధ్యత వహించాల్సిన నాయకులు, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రినేత్రం న్యూస్‌కి స్పందించిన బాటసారులు, వాహనదారులు మాట్లాడుతూ”ప్రతి రోజు ఈ మార్గం మీదుగా భయం భయంగా ప్రయాణిస్తున్నాం… కానీ అధికారులు, నాయకులు చూసినా చూడనట్లుగా ముందుకు వెళ్లిపోతున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారిపై ఇదే పరిస్థితి అయితే, మారుమూల గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు అధికారులు, నాయకులు, కనీస స్పందన చూపకపోతే ప్రజల భద్రత ఎవరి బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు గిరిజనులు.
ప్రభుత్వం మేలుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ రోడ్డు ప్రమాదాలు జరగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, సంబంధిత శాఖలు వెంటనే స్పందించి బురద గెడ్డ వంతెనను పునరుద్ధరించాలి, రోడ్డులోని ప్రమాదకర రంధ్రాలను తక్షణమే పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


