Secretariat : సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట : సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో స్థానిక మండలంలో బదిలీలకు ఆప్షన్ కల్పించాలని మండపేట మండల సచివాయలం ఉద్యోగులు డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలులో మిగులు సిబ్బందికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలు జారీచేయాలని కోరారు. రేషనలైజేషన్ బదిలీ ప్రక్రియలలో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. నిర్దిష్టమైన సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానెల్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని డిమాండ్ చేశారు.మండపేట మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల ఉద్యోగులు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ సత్యనారాయణమూర్తి కి వినతి పత్రం అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition on the problems

You cannot copy content of this page

Scroll to Top