దేవరకొండ జూన్24 త్రినేత్రం న్యూస్. దేవరకొండలోఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్యాంకు డే సందర్భంగా రక్తదాన దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు, దేవరకొండ మల్లె పెళ్లి ,నాంపల్లి ,గుడిపల్లి, మల్లె పెళ్లి ,చెరుకుపల్లి ,పులిచర్ల సిబ్బందితో కార్యక్రమం చేపట్టడం జరిగినది. రక్తదాన శిబిరానికి 72 మంది విచ్చేసి రక్త దానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని నల్గొండ రీజనల్ మేనేజర్ K శివ కృష్ణ బాబు, సూపర్డెంట్ డాక్టర్ రవి ప్రకాష్, SBISUHC OBC వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు NVT,CM ఫణీంద్ర, కామ్రేడ్స్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు.
అనంతరం వారు మాట్లాడుతూ దానాలల్ల రక్తదానం చాలా గొప్పదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 సంవత్సరాల నుండి కష్టమర్స్ కి ఎన్నో సేవలు అందించిందని. ఎంతో మందిని అభివృద్ధిలోకి తీసుకు వచ్చిందని, రైతులని ఆదుకుందని, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చి వారి భవిష్యత్తుకి పూల దారి వేయడం జరిగిందని , సమాజసేవ కార్యక్రమాలలో కూడా ముందుంటుందని ,ఈ రక్తదాన శిబిరాలు గర్భిణీ స్త్రీలకు ఆక్సిడెంట్ అయినవాళ్లకు ప్రాణాపాయంలో ఉన్నవాళ్లకు ఎంతో మందికి ఉపయోగపడుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు, ఈ రక్తదాన శిబిరాలు దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిందని తెలియజేశారు.
ఈ రక్తదాన శిబిరంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చరణ్, శ్రీనివాస్, పండు నాయక్, శ్రీరామచంద్రమూర్తి, జయప్రకాష్, సీనయ్య ,సాయి, DSA ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ్ర సుజిత్, తాళ్ల సురేష్ ,వెంకట్, రాజకుమార్, ప్రవీణ్, చక్రపాణి, శ్రీకాంత్ ,వెంకటేష్ , శివ, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


