తేదీ : 23/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టర్ రేట్ లో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రజల నుంచి మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు దరఖాస్తులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కరించేందుకు , అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి వెంకటేశ్వరరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


