Gaddam Prasad Kumar : యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో జరిగిన యోగా డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులతో పాల్గొని రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆసనాలు వేశారు.
ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ..యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆచరించాలన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానమని నేను రోజు యోగా చేస్తానని తెలిపారు.యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా మనిషిలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చని శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో యోగా పట్ల ప్రజలలో ఆసక్తి బాగా పెరిగిందని ఎక్కువ మంది యోగాను చేస్తున్నారని పేర్కొన్నారు.
భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితం పతంజలి మహార్షి ద్వారా యోగ వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు.
యోగాను అన్ని వయసుల వారు చేయవచ్చని, స్వంతంగా కంటే గురువుల మార్గదర్శకంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు.యోగాను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగాఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలందరికీ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్, డి ఎస్ పి శ్రీనివాస్, యువజన క్రీడల అభివ్రుది అధికారి ఇంచార్జి) మహమ్మద్ అబ్దుల్ సత్తార్, ఎల్ డి ఎం యాదగిరి ,అయుష్ సునీత , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yoga is not just a

You cannot copy content of this page

Scroll to Top