పాఠశాలకు 20 లక్షల భారీ విరాళం అందజేసిన గుంత శ్రీనివాస్ కు ఘన సన్మానం

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. దిండి మండల పరిధిలోని తోకలాపూర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల కు భారీ విరాళం ఇచ్చిన గుంత శ్రీనివాస్ కు శుక్రవారం నాడు ఘన సన్మాన కార్యక్రమం జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఏఎస్పి పి మౌనిక పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడారు.
పాఠశాలల మౌలిక వసతుల కల్పన కోసం రూపాయలు 20 లక్షల భారీ విరాళం అందజేసిన దాత గుంత శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ అంబటి ఆంజనేయులు, ఎంఈఓ గోప్యా నాయక్ , ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Guntha Srinivas, who donated

You cannot copy content of this page

Scroll to Top