త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పురపాలక సంఘ పరిధిలో 2వ వార్డు నందు నిర్మాణ దశలో ఉన్నటువంటి నూతన ఆసుపత్రి భవనం నిర్మాణ పనులను బుధవారం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పరిశీలించారు. ఈ సంధర్బంగా సదరు ఆసుపత్రి భవనం నందు నిర్మాణం పూర్తి దశలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ విభాగపు పనులు మరియు ఇంకనూ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు గాను అంచనా లపై ఏపీఎంసీడీసీ, అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతరావు, మేడింటి సూర్యప్రకాష్, పాలచర్ల శిరీష్, శెట్టి రవి, వాదా ప్రసాదరావు, మున్సిపల్ అధికారులు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


