జీనబాడు–పాలబంద రోడ్డుకు శంకుస్థాపన

TRINETHRAM NEWS

డోలిమోతలకు వీడ్కోలు చెప్పే రోజు… గ్రామస్తుల చిరకాల కలకు శ్రీకారం

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, జూన్ 18 (త్రినేత్రం న్యూస్): అనంతకాలంగా రహదారి సౌకర్యం లేక డోలిమోతలపై ప్రయాణిస్తూ వేదన పడుతున్న పాలబంద, పులగరువు, గ్రామాలకు మంగళవారం ఓ మంచి రోజు. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని పాలబంద గ్రామంలో నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది.
ఈ రహదారి ద్వారా పులగరువు నుంచి పాలబంద వరకు ప్రయాణించే సుమారు నాలుగు నుండి ఐదు గ్రామాల ప్రజలకు నిత్యసందర్శన, విద్య, వైద్య సేవలకు వేగవంతమైన అనుసంధానం ఏర్పడనుంది. గతంలో వర్షాకాలాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారేది. డోలిమోతలే ఒక్కటే మార్గమయ్యేది. ఆ దుస్థితికి తీరుస్తూ ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభమవడం పట్ల ప్రజల్లో ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది.
కూటమి ప్రభుత్వం రాగానే ప్రారంభమైన కసరత్తు
ఈ రహదారి మంజూరుకు టిడిపి నాయకులు, స్థానిక గ్రామస్తులు చేసిన కృషి ప్రస్తావనీయంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీనబాడు టిడిపి నాయకులు, పాలబంద గ్రామస్తులు ఐటిడిఏ పాడేరు కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఈ సమస్యను వివరంగా లేవనెత్తారు. అంతేగాక రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్‌ను కలిసి రోడ్డు మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడం వల్లే ఈ రోజు శంకుస్థాపన జరగగలిగిందని స్థానికులు తెలిపారు.ప్రజాప్రతినిధులతోపాటు కార్యకర్తల ఉత్సాహం
ఈ కార్యక్రమంలో జి. సురేష్, పి.దేవుడు,ఎస్. దేవుళ్ళు, జి.శ్రీరాములు, మరోక ముఖ్య కార్యకర్త కొంటె చంటి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్థులే కాకుండా, వేరే గ్రామాల నుండి వచ్చిన ప్రజలు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కొంటె చంటి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఇదొక నూతన అంకురం ఇది కేవలం రహదారి శంకుస్థాపన మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభివృద్ధికి మొదటి మెట్టు అని గ్రామస్థులు భావిస్తున్నారు. “ఇదొక విజయపథం మొదలు. రేపు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు గ్రామానికి చేరవచ్చునంటే కారణం ఈ రోడ్డే అవుతుంది,” అని కొంటె చంటి అభిప్రాయపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foundation stone laid for

You cannot copy content of this page

Scroll to Top