Chevireddy : బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెవిరెడ్డి అడ్డగింత

TRINETHRAM NEWS

Trinethram News : బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లాలనుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుమతి లభించలేదు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండటంతో అక్కడి ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనపై కేసులు లేవని…ఎఫ్ఐఆర్‌లు లేవని అయినా ఎందుకు ఆపారని చెవిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది.

చెవిరెడ్డిపై లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. తాజాగా ఆయన లిక్కర్ కేసులోనూ మనీ లాండరింగ్ లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన వ్యక్తులు అసలు సమాచారం ఇచ్చారని బయటకు తెలిసిన తర్వాత వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో దొరికిన ఎనిమిది కోట్లకు లెక్కలున్నాయని అవి తనవి కావని చెప్పుకున్నారు.

వాటితో పాటు పోలీసుల్ని బెదిరించిన ఘటనలు.. ఇతర కేసులు ఆయనపై చాలా ఉన్నాయి. సైలెంటుగా గా ఆయన బెంగళూరు నుంచి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో దొరికిపోయారు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేస్తారా ..విచారణ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలో చెవిరెడ్డి కుమారుడ్ని విదేశాలకు తరలించాలనుకున్నారు. కానీ లుకౌట్ నోటీసు ద్వారా విషయం తెలుసుకుని అరెస్టు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chevireddy's obstruction at Bangalore

You cannot copy content of this page

Scroll to Top