MLA Balu Naik : రైతుల భవిష్యత్తు దిశగా రైతునేస్తం – రైతులతో ముఖాముఖి కార్యక్రమం

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 16త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లాదేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో “రైతునేస్తం – రైతులతో ముఖాముఖి” టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ ,జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి పాల్గొని రైతులతో నేరుగా సంభాషించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ముఖ్యమైన పథకాలను వివరించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధి, ఎరువుల, విత్తనాల సరఫరా, మార్కెట్ సదుపాయాలు, రుణ మాఫీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

అనంతరం రైతుల నుంచి ప్రత్యక్షంగా సమస్యలను విని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాలు నాయక్ హామీ ఇచ్చారు. సీఎం సంకల్పంతో రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారేందుకు చేపడుతున్న చర్యలను రైతులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, రైతుల మధ్య నేరుగా సమీక్షా వేదిక ఏర్పడడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, ఆర్టీఓ రమణారెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ భవాని పవన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rythunestam towards the future

You cannot copy content of this page

Scroll to Top