MLA Vegulla : తల్లికి వందనం పై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు

TRINETHRAM NEWS

దిగజారుడు ఆరోపణలు మానుకోవాలి…

ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ప్రతీ తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి వందనం అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని జగన్ రెడ్డి మరియు,కో మాత్రం కల్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు మండిపడ్డారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో ఎంతమంది విధ్యార్ధులు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్ధులకు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.2 వేలు లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే రుజువు చెయ్యాలని సవాల్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయటమే వైసీపీ నేతల పని అని విమర్శించారు. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ రెడ్డి నేడు తల్లికి వందనం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

వైసీపీ హయాంలో అమ్మ ఒడి రూ.13 వేలు ఇచ్చారని అంటే రూ.2 వేలు జగన్ జేబుల్లోకి పోయాయా? తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయా? వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు తల్లికి వందనం ఇస్తుందన్నారు. కుటుంబంలో ఒక్కరికే అనే షరతు పెట్టి పేద, మధ్య తరగతి విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను జగన్ మోహన్ రెడ్డి మానసికంగా వేధింపులకు గురి చేసిన విషయం వాస్తవం కాదా? చెప్పాలన్నారు. కాని ఇప్పుడు 67 లక్షల మంది విద్యార్ధుల తల్లులకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం అన్నారు. ఇందు కోసం రూ.8,700 కోట్లు విడుదల చేయటం జరిగిందన్నారు.

పాఠశాలలు తెరిచేలోగా పధకం అమలు చేస్తామని మాట ఇచ్చాం… దానిని నిలబెట్టుకున్నాం అన్నారు. ఇకనైన చౌకబారు ఆరోపణలు జగన్ రెడ్డి, మరియు, కో మానుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ళ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాల దొర, అమలాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు వై.ఆర్.కె.పరమహంస, రాయవరం మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు, పసలపూడి గ్రామశాక అధ్యక్షులు మల్లిడి సూర్రెడ్డి, పధాన కార్యదర్శి అనసూరి శ్రీను, మాజీ ఎంపిటిసి నల్లమిల్లి వెంకన్నబాబు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSRCP leaders spreading false

You cannot copy content of this page

Scroll to Top